తెలంగాణలో కొత్తగా 767 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,18,778 కరోనా పరీక్షలు
- ఖమ్మం జిల్లాలో 84 కొత్త కేసులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 77 కేసులు
- రాష్ట్రంలో ముగ్గురి మృతి
- ఇంకా 10,064 మందికి చికిత్స
అదే సమయంలో 848 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో ఇప్పటివరకు 3,738 మంది కరోనాతో కన్నుమూశారు. రాష్ట్రంలో నేటివరకు 6,33,146 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,19,344 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 10,064 మందికి చికిత్స జరుగుతోంది.
