శాశ్వత భవనం కట్టించిన సాయితేజ్ కు కృతజ్ఞతలు తెలిపిన ఓల్డేజ్ హోం నిర్వాహకులు
- విజయవాడలో సొంతభవనంలేని వృద్ధాశ్రమం
- సాయం కోరిన నిర్వాహకులు
- పుట్టినరోజు సందర్భంగా సాయితేజ్ నిర్ణయం
- అభిమానులకు పిలుపు
- భారీ మొత్తంతో భవన నిర్మాణం పూర్తి
ఈ నేపథ్యంలో, సాయితేజ్ తన పుట్టినరోజు సందర్భంగా ఈ భవనం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకుని అభిమానులకు పిలుపునిచ్చారు. తన జన్మదిన వేడుకలకు అయ్యే ఖర్చును ఓల్డేజ్ హోం భవనం కోసం వినియోగిద్దామని సూచించగా, అభిమానుల నుంచి రూ.1 లక్ష వరకు అందింది. ఆపై, తాను అత్యధిక మొత్తంలో విరాళం అందించి వృద్ధాశ్రమానికి శాశ్వత భవనం నిర్మించారు.
తాజాగా, ఆ ఓల్డేజ్ హోం నిర్వాహకులు సాయితేజ్ కు కృతజ్ఞతలు తెలిపారు. సాయితేజ్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు ఆహ్వానం పలికారు. ఈ నూతన భవనానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.