సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా
- ఈ నెల 14న పోలవరం వెళ్లాలనుకున్న సీఎం జగన్
- ఒక్కరోజు ముందు పర్యటన వాయిదా
- ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం
- అధికారులకు సమాచారం
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకే రేపు పోలవరం సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో, తిరిగి ఎప్పుడు పోలవరం వెళ్లాలనేది తదుపరి నిర్ణయించనున్నారు.