రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న జగన్
- ఉదయం 10 గంటలకు హెలికాప్టర్ లో బయల్దేరనున్న జగన్
- పనుల పురోగతిని పరిశీలించనున్న సీఎం
- అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం
రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గంలో హెలీప్యాడ్ కు జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో పోలవరంకు పయనమవుతారు. 11.10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు. 1.20 గంటలకు పోలవరం నుంచి తిరుగుపయనమవుతారు.