ఓటీటీ కోసం నాగార్జున చిత్ర నిర్మాణం?

Nagarjuna to produce films for OTT
  • ఓటీటీ వైపు మళ్లుతున్న హీరోయిన్లు 
  • పారితోషికం పరంగా బాగా గిట్టుబాటు 
  • తాజాగా ఓటీటీపై దృష్టి పెట్టిన నాగార్జున  
ఈవేళ ఓటీటీ అన్నది థియేటర్లకు ప్రత్యామ్నాయం అవుతోంది. ముఖ్యంగా కోవిడ్ లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూతబడడంతో ఓటీటీ ప్రాధాన్యం తెలిసొచ్చింది. చాలా సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా రిలీజయ్యాయి. దీంతో బాటుగా పలువురు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు ఓటీటీ వేదికలకు మళ్లుతున్నారు. ఓటీటీ నుంచి పారితోషికం పరంగా కూడా బాగా గిట్టుబాటవుతుండడంతో పలువురు హీరోయిన్లు ఇప్పటికే వెబ్ సీరీస్, టాక్ షోస్ చేస్తూ బిజీగా వున్నారు.

ఈ క్రమంలో తాజాగా అక్కినేని నాగార్జున కూడా ఓటీటీ వైపు దృష్టి పెడుతున్నట్టు సమాచారం. త్వరలో ఓటీటీ కోసం ఆయన ప్రత్యేకంగా ఓ సినిమాని నిర్మిస్తున్నారట. ఇందుకోసం కథ కూడా ఇప్పటికే సిద్ధమైందని అంటున్నారు. అయితే, ఇందులో ఆయన నటిస్తారా? లేదా? అన్నది ఇంకా తెలియరాలేదు. అలాగే, ఓటీటీ ప్లేయర్స్ కోసం మరికొన్ని ప్రాజక్టులు కూడా ఆయన చేబడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుంచితే, ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రాన్ని, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' చిత్రాన్ని చేస్తున్నారు.
Go Back to Shorts
Nagarjuna
OTT
Web Series
Bangarraju

More Telugu News