తెలంగాణలో కొత్తగా 696 కరోనా పాజిటివ్ కేసులు

  • గత 24 గంటల్లో 1,05,797 కరోనా పరీక్షలు
  • ఖమ్మం జిల్లాలో 82 కేసులు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 68 మందికి కరోనా
  • రాష్ట్రంలో ఆరుగురి మృతి
  • ఇంకా 10,148 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,05,797 కరోనా పరీక్షలు నిర్వహించగా, 696 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 82 కొత్త కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 68 కేసులు గుర్తించారు. అత్యల్పంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఒక కేసు నమోదైంది. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 858 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి మొత్తం 3,735 మంది కరోనాతో మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 6,32,379 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,18,496 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,148 మంది చికిత్స పొందుతున్నారు.

Telangana
Corona Cases
Deaths
Bulletin
Update

More Telugu News