జగన్ ను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా?: రఘురాజు
- దేవాలయాలపై దాడులు జరగకూడదని చెప్పడం పార్టీ వ్యతిరేక నిర్ణయం కిందకు వస్తుందా?
- నా అభిప్రాయాలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయా?
- రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే వేటు వేయాలని అంటారా?
తాను వెల్లడిస్తున్న అభిప్రాయాలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? అని రఘురాజు ప్రశ్నించారు. తన పార్లమెంటు సభ్యత్వంపై వేటు వేయాలని వైసీపీ చేస్తున్న డిమాండ్ కు కారణం ఏమిటని నిలదీశారు. తాను చేసిన తప్పు ఏమిటో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే వేటు వేయాలని అంటారా? అని మండిపడ్డారు.