Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైద‌రాబాద్ స‌హా తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పెద్ద ఎత్తున‌ ధ‌ర్నా.. ఎడ్లబండ్ల‌పై నిరసన ర్యాలీలు

congress agitation on petrol price hike
  • దేశంలో పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుద‌ల‌పై నిర‌స‌న‌
  • ప‌లువురు నేత‌ల అరెస్టు
  • ఇందిరా పార్క్ వ‌ద్ద ఉద్రిక్త‌త‌
దేశంలో పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతోన్న నేప‌థ్యంలో  కాంగ్రెస్‌ పార్టీ పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద నిర‌స‌న తెల‌ప‌డానికి పీసీసీ కొత్త‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌ ఎడ్లబండి మీద వచ్చారు. అయితే, ధర్నాకు అనుమతి లేదంటూ  పోలీసులు ఆయనను అరెస్టు చేయడానికి యత్నించడంతో ఉద్రిక్త‌త నెల‌కొంది.

ఈ సందర్భంగా పలువురు ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఇందిరా పార్క్‌, ధర్నా చౌక్‌ వద్దకు వచ్చిన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీత రావు, ఇతర మహిళా నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరోపక్క, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌తో పాటు రాములు నాయ‌క్, ఫిరోజ్ ఖాన్ ఇత‌ర కాంగ్రెస్ నేత‌లు కూడా హైద‌రాబాద్‌లో మరోచోట నిర‌స‌న‌లో పాల్గొన్నారు.

వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించారు. నిర్మ‌ల్‌లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి..  ఏలేటి మహేశ్వర్ రెడ్డితో క‌లిసి పాద‌యాత్ర చేస్తున్నారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లోనూ పెట్రోల్ ధ‌ర‌ల పెంపున‌కు నిర‌స‌న‌గా కాంగ్రెస్ ఆందోళ‌న‌కు దిగింది. ఎడ్ల‌బండ్ల‌తో పాటు సైకిళ్లతో కాంగ్రెస్ నేత‌లు ర్యాలీ నిర్వ‌హించారు.

పెట్రోల్, డిజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ  వికారాబాద్  జిల్లా కేంద్రంలోని ఆలంపల్లి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు సైకిల్, బండి ర్యాలీలు నిర్వ‌హించారు. ఈ నిర‌స‌న‌లో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు ప‌లువురు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరులో ఎడ్లబండ్లు ఎక్కి అక్క‌డి కాంగ్రెస్ నేత‌లు నిరస‌న తెలిపారు.
Congress
petrol
diesel

More Telugu News