Raviteja: రవితేజ నుంచి 'రామారావు ఆన్ డ్యూటీ' ఫస్టులుక్

Ravi Teja First Look from RamaRao On Duty movie
  • 'క్రాక్'తో లభించిన భారీ సక్సెస్
  • విడుదలకి రెడీ అవుతున్న 'ఖిలాడి'
  • టైటిల్ ఖరారు చేసుకున్న నెక్స్ట్ మూవీ
  • దర్శకుడిగా శరత్ మండవ పరిచయం  
కరోనా కారణంగా ఒక వైపున పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ, రవితేజ తన దూకుడును మాత్రం తగ్గించలేదు. మొదటి లాక్ డౌన్ తరువాత థియేటర్లకు వచ్చిన 'క్రాక్' సంచలన విజయాన్ని నమోదు చేసింది. రవితేజ కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా అది నిలిచింది. ఆ సినిమాను గురించి ఇంకా అంతా మాట్లాడుకుంటూ ఉండగానే, రవితేజ 'ఖిలాడి' సినిమాను కూడా విడుదల వైపుకు నడిపిస్తున్నాడు.ఆ సినిమా అలా థియేటర్ల దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉండగానే, శరత్ మండవ అనే కొత్త దర్శకుడికి రవితేజ ఛాన్స్ ఇచ్చాడు. ఇటీవల పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయింది. తాజాగా ఈ సినిమాకి 'రామారావు ఆన్ డ్యూటీ' అనే టైటిల్ ను ఖరారు చేసి, ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. రవితేజ స్టైలీష్ లుక్ ఆసక్తిని పెంచేదిలా ఉంది. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో, రవితేజ జోడీగా దివ్యాన్ష కౌశిక్ కనిపించనుంది. సామ్ సీఎస్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.
Raviteja
Divyansha Koushik
Sharath Mandava

More Telugu News