Huzurabad: ఆడియో కలకలం.. కౌశిక్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసు

Congress leader Koushik Reddy audio leaked
  • హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ నాకే అంటూ కౌశిక్ రెడ్డి ఆడియో
  • యువతకు రూ. 4 - 5 వేలు ఇస్తానని వ్యాఖ్య
  • కౌశిక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ
కాంగ్రెస్ నేత పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లబోతున్నారనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతోంది. అయితే పార్టీ మార్పుపై కౌశిక్ రెడ్డి ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఆయన మాట్లాడిన ఒక ఆడియో లీక్ అయింది. ఇప్పుడు ఈ ఆడియో కలకలం రేపుతోంది. హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే అంటూ ఆ ఆడియోలో కౌశిక్ రెడ్డి చెప్పారు.

ఈ నేపథ్యంలో, కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీపీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా పార్టీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి మాట్లాడుతూ, గత కొంత కాలంగా కౌశిక్ రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నారని చెప్పారు. ఆయనపై పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఫోన్ సంభాషణపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించామని... లేని పక్షంలో ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Huzurabad
Koushik Reddy
Congress
TRS
Audio

More Telugu News