నెరవేరిన 28 ఏళ్ల అర్జెంటీనా కల.. దేశానికి కోపా కప్‌ను అందించిన మెస్సీ
- ఫైనల్‌లో బ్రెజిల్‌తో హోరాహోరీగా పోరు
- ఏంజెల్ డీ మారియో గోల్‌తో టైటిల్ సొంతం
- అర్జెంటీనాలో మిన్నంటిన సంబరాలు
దేశానికి అంతర్జాతీయ టైటిల్‌ను తీసుకురావాలన్న మెస్సీ కల ఇన్నాళ్లకు నెరవేరింది. దిగ్గజ ఆటగాడైన డీగో మారడోనా నేతృత్వంలో కూడా అర్జెంటీనా కోపా టైటిల్‌ను సాధించలేకపోయింది. 1973లో తొలిసారి అర్జెంటీనా కోపా కప్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1993లో చివరిసారి దక్కించుకుంది. 28 ఏళ్ల నిరీక్షణకు తెరిదించుతూ మరోమారు కప్‌ను సొంతం చేసుకుంది. కోపా కప్ సొంతం కావడంతో అర్జెంటీనాలో సంబరాలు మిన్నంటాయి.