తెలంగాణలో కొత్తగా 704 మందికి కరోనా

Telangana corona positive cases update
  • గత 24 గంటల్లో 1,00,632 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 77 కేసులు
  • నారాయణపేట జిల్లాలో కొత్త కేసులు నిల్
  • రాష్ట్రంలో ఐదుగురి మృతి
  • ఇంకా 10,724 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 1,00,632 కరోనా పరీక్షలు నిర్వహించగా, 704 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 77 కొత్త కేసులు నమోదు కాగా, నల్గొండ జిల్లాలో 64 కేసులు గుర్తించారు. నారాయణపేట జిల్లాలో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 917 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 3,725కి పెరిగింది.

తెలంగాణలో ఇప్పటివరకు 6,31,218 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,16,769 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 10,724 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Telangana
Corona Virus
Positive Cases
Update
Bulletin

More Telugu News