జోరుగా జరుగుతున్న 'ఆదిపురుష్' షూటింగ్!
- 'ఆది పురుష్' కోసం భారీ సెట్టింగులు
- సైఫ్ పై సాగుతున్న చిత్రీకరణ
- త్వరలో జాయిన్ కానున్న ప్రభాస్
- సీత పాత్రలో కృతి సనన్
ఈ సినిమా షూటింగులో ప్రభాస్ ఇంకా జాయిన్ కాలేదు. సైఫ్ అలీఖాన్ సోలో సీన్స్ చిత్రీకరణ పూర్తయ్యేలోగా, 'సలార్' షూటింగును పూర్తిచేసుకుని ప్రభాస్ వస్తాడని అంటున్నారు. ఆ తరువాత 'అయోధ్య' నేపథ్యంలో సాగే సన్నివేశాలను చిత్రీకరిస్తారని అంటున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో భారీ సెట్టింగులు వేశారు. వీఎఫెక్స్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేయనున్నారు. బాలీవుడ్ లో పౌరాణిక నేపథ్యంలో ఇంతవరకూ వచ్చిన సినిమాలకు అగ్రస్థానంలో ఈ సినిమా నిలుస్తుందని దర్శక నిర్మాతలు చెప్పడం, అందరిలో మరింత ఆసక్తిని రేపుతోంది.