మరింత ముందుకు వెళుతున్న 'హరి హర వీరమల్లు'
- కరోనా కారణంగా సినిమాల నిర్మాణంలో జాప్యం
- సంక్రాంతికి 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్
- వేసవికి వెళుతున్న 'హరి హర వీరమల్లు'
ముందుగా అనుకున్న ప్రకారం 'హరిహర వీరమల్లు' సంక్రాంతికి రావలసి ఉంది. కానీ కరోనా ఎఫక్ట్ కారణంగా ఈ సినిమా కూడా షూటింగ్ పరంగా ముందుకు వెళ్లలేకపోయింది. షూటింగ్ పరంగా జరిగిన జాప్యం వలన ఈ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశం లేదు. అందువలన సంక్రాంతి బరిలోకి 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్ ను దింపాలని చూస్తున్నారట.
చారిత్రక నేపథ్యంలో .. మొగల్ చక్రవర్తుల కాలంనాటి కథతో నడిచే 'హరి హర వీరమల్లు', ఎక్కువ భాగం షూట్ చేయవలసి ఉంది. ఈ కారణంగా ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ విషయంపై రెండు ప్రాజెక్టుల వారి మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు.