Pawan Kalyan: వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటుపై పవన్ కల్యాణ్ స్పందన

Pawan Kalyan opines on YS Sharmila new party in Telangana
  • ఇవాళ పార్టీ ప్రకటించబోతున్న షర్మిల
  • పార్టీ ఏర్పాటును స్వాగతిస్తున్నామని వెల్లడి
  • ఇది ప్రజాస్వామ్యం అని వివరణ
  • మరిన్ని పార్టీలు రావాలని ఆకాంక్ష
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణలో నేడు రాజకీయ పార్టీ ప్రకటించబోతున్నారు. దీనిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఏపీ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ మీడియాతో మాట్లాడుతూ, వైఎస్ షర్మిల పార్టీని స్వాగతిస్తున్నాం అని జనసేన వైఖరిని వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో మరిన్ని పార్టీలు రావాలని ఆకాంక్షించారు. ఉద్యమ, చైతన్య స్ఫూర్తి యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

జనసేన రాజకీయ ప్రస్థానం గురించి వివరిస్తూ, తానేమీ పగటి కలలు కనడంలేదని స్పష్టం చేశారు. తనకు రాజకీయ వారసత్వం చేతకాదని పేర్కొన్నారు. "తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలనుకున్నాను.. నాకు డబ్బు, బలం లేదు" అని వెల్లడించారు.
Pawan Kalyan
YS Sharmila
Political Party
Democracy
Telangana
Janasena

More Telugu News