అన్ని అర్హతలున్నా టీపీసీసీ పదవి ఇవ్వకుంటే బాధగా ఉంటుంది: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- ఆ బాధలోనే విమర్శలు చేశా
- అంతమాత్రాన పార్టీ మారినట్టేనా?
- ఏ పార్టీలోకి వెళ్లట్లేదని స్పష్టీకరణ
పార్టీ సీనియర్ నేతగా ఆవేదనతోనే ఆ విమర్శలు చేశానని చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం మంత్రి పదవికే రాజీనామా చేశానని, తనకు పదవులు లెక్క కాదని అన్నారు. తనకు చాలా పార్టీల నుంచి ఆహ్వానం వచ్చిందని, తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. పార్టీలో పరిణామాలపై విమర్శలు చేసినంత మాత్రాన పార్టీ మారినట్టేనా? అని ప్రశ్నించారు. పైసా తీసుకోకుండా కార్యకర్తలు తనను ఎంపీగా గెలిపించారని చెప్పారు.