ఖైదీలతో విచ్చలవిడిగా శృంగారం.. కాలిఫోర్నియాలో దొరికిపోయిన 26 ఏళ్ల జైలు అధికారిణి
- సంచలనం సృష్టించిన ఘటన
- 11 మంది ఖైదీలు చూస్తుండగా మరో ఖైదీతో బహిరంగ శృంగారం
- ఖైదీలకు సెల్ఫోన్లు, బ్లేడ్లు సరఫరా
- ఆమె ప్రవర్తనకు షాకైన న్యాయమూర్తి
2016 నుంచి కౌంటీ జైలులో పనిచేస్తున్న టీనా నచ్చిన సమయాల్లో ఖైదీలతో విచ్చలవిడిగా, బహిరంగంగా శృంగారంలో పాల్గొనేది. ఓసారి 11 మంది ఖైదీలు చూస్తుండగా మరో ఖైదీతో శృంగారంలో పాల్గొంది. ఖైదీలతో సన్నిహితంగా మెలిగే ఆమె వారికి సెల్ఫోన్లు, బ్లేడులు కూడా సరఫరా చేసేదని తేలింది. ఎప్పుడైనా జైలులో సోదాలు నిర్వహించే సమయంలో ముందస్తుగా ఖైదీలకు సమాచారం అందించేది. ఫోన్లలో ఖైదీలతో అసభ్యంగా మాట్లాడడమే కాకుండా తాను చేసిన నేరాల గురించి వారితో గర్వంగా చెప్పుకునేదని విచారణ సమయంలో జైలు అధికారి కోర్టుకు తెలిపారు. ఆమె ప్రవర్తనకు న్యాయవాది షాకయ్యారు. కాగా, ఆమెకు గత నేరచరిత్ర లేకపోవడంతో జైలు శిక్ష తగ్గింది.