రోదసీలో చైనా మరో ఘనత.. వ్యోమగాముల తొలి స్పేస్ వాక్

Chinese astronauts conduct spacewalk
  • సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్న చైనా
  • ‘తియాన్హే’ నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్ చేసిన వ్యోమగాములు
  • దాదాపు ఏడు గంటలపాటు కేంద్రం బయటే
రోదసీలో సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్న చైనా మరో ఘనత సాధించింది. ఆ దేశ వ్యోమగాములు ఇద్దరు తొలిసారి తమ అంతరిక్ష కేంద్రం ‘తియాన్హే’  నుంచి బయటకు వచ్చి స్పేస్‌వాక్ చేశారు. అనంతరం అంతరిక్ష కేంద్రానికి కెమెరాలు, ఇతర పరికరాలను అమర్చారు. అంతరిక్ష కేంద్రంలో మొత్తం ముగ్గురు వ్యోమగాములు ఉండగా, వారిలో లియు బోమింగ్, టాంగ్ హోంగ్‌లు స్పేస్‌వాక్ చేశారు. దాదాపు ఏడు గంటలపాటు వీరు అంతరిక్ష కేంద్రం బయటే ఉన్నారు.

జూన్ 17న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న ఈ వ్యోమగాములు మూడు నెలల పాటు అక్కడే ఉంటారు. ఏప్రిల్ 29న చైనా తన అంతరిక్ష కేంద్రానికి చెందిన తొలి మాడ్యూల్‌ను రోదసీలోకి పంపింది. వచ్చే ఏడాది చివరి నాటికి అంతరిక్ష కేంద్రాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని చైనా యోచిస్తోంది. ఇందుకోసం ఏకంగా 11 రాకెట్లను ప్రయోగించనుంది. పూర్తిస్థాయిలో సిద్ధమైన తర్వాత తియాన్హే అంతరిక్ష కేంద్రం బరువు 70 టన్నులు ఉంటుంది.
Go Back to Shorts
China
Astronauts
Spacewalk
China Manned Space Agency
Tianhe

More Telugu News