జీహెచ్ఎంసీ పరిధిలో 100కి దిగువన కరోనా కేసులు

Corona cases number declines in GHMC region
  • గత 24 గంటల్లో 1,08,954 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో 98 కేసులు
  • రాష్ట్రవ్యాప్తంగా 848 మందికి కరోనా
  • ఆరుగురి మృతి
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా వ్యాప్తి బాగా తగ్గిపోయింది. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 98 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇటీవల కాలంలో గ్రేటర్ హైదరాబాదులో ఇదే కనిష్ఠం. ఇక రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల విషయానికొస్తే... గడచిన 24 గంటల్లో 1,08,954 కరోనా పరీక్షలు నిర్వహించగా, 848 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా వ్యాప్తి నిదానించింది.

అదే సమయంలో 1,114 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. తెలంగాణలో ఇప్పటివరకు 6,26,085 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,09,947 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,454 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,684కి చేరింది.
Go Back to Shorts
GHMC
Corona Cases
Deaths
Telangana

More Telugu News