ఇటీవలే నిశ్చితార్థం... అంతలోనే సంచలన ప్రకటన చేసిన మెహరీన్
- గత మార్చిలో భవ్య బిష్ణోయ్ తో మెహరీన్ నిశ్చితార్థం
- త్వరలోనే పెళ్లి అనుకుంటుండగా నిశ్చితార్థం రద్దు
- ట్విట్టర్ లో వెల్లడించిన టాలీవుడ్ తార
- ఇద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నామన్న మెహరీన్
ఇప్పటినుంచి తనకు భవ్య బిష్ణోయ్ తో గానీ, అతడి కుటుంబీకులతో గానీ ఎలాంటి సంబంధం ఉండబోదని మెహరీన్ వివరణ ఇచ్చింది. గత మార్చిలో మెహరీన్, భవ్య బిష్ణోయ్ ల నిశ్చితార్థం జైపూర్ లో అత్యంత ఘనంగా జరిగింది. ఇక పెళ్లే తరువాయి అనుకుంటున్న సమయంలో మెహరీన్ నిశ్చితార్థం రద్దు విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.