పవన్ - రానా సినిమా టైటిల్ ఖరారైనట్టే!
- కొంతవరకూ జరిగిన చిత్రీకరణ
- 11వ తేదీ నుంచి నెక్స్ట్ షెడ్యూల్
- పరిశీలనలో 'పరశురామ కృష్ణమూర్తి' టైటిల్
- నాయికలుగా నిత్యామీనన్ .. ఐశ్వర్య రాజేశ్
ఈ సినిమాలో పవన్ - రానా ఇద్దరి పాతలు ప్రధానమైనవే. రెండు పాత్రలకి సమానమైన ప్రాధాన్యం ఉంటుంది. మలయాళంలో ఈ రెండు పాత్రల పేర్లను కలిపే టైటిల్ పెట్టారు. అదే పద్ధతిని తెలుగు రీమేక్ లోను పాటించనున్నారు. అలా ఈ సినిమాకి 'పరశురామ కృష్ణమూర్తి' అనే టైటిల్ ను సెట్ చేయాలనుకుంటున్నారట. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో, నిత్యామీనన్ .. ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు.