అటవీ భూములు స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులు.. దాడిచేసి పెట్రోలు పోసిన రైతులు
- నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఘటన
- అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన అధికారులపై దాడి
- ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జోక్యంతో వెనక్కి తగ్గిన గిరిజనులు
ఈ క్రమంలో నిన్న చెంచులు సాగుచేస్తున్న ఆ భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు మాచారం వెళ్లారు. గమనించిన చెంచులు అధికారులను అడ్డుకుని నిలదీశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. కొందరు రైతులు అటవీ అధికారులపై పెట్రోలు పోయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడడంతో వారు వెనక్కి తగ్గారు.