ఓటీటీ వైపే అడుగేసిన 'డాక్టర్'
- శివకార్తికేయన్ హీరోగా 'డాక్టర్'
- ఆయన జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్
- దర్శకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్
- హాట్ స్టార్ చేతికి రిలీజ్ పగ్గాలు
అలా తాజాగా తమిళ సినిమా 'డాక్టర్' కూడా ఓటీటీ బాట పట్టింది. శివకార్తికేయన్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను రూపొందించాడు. ప్రస్తుతం ఆయన విజయ్ హీరోగా 'బీస్ట్' చేస్తున్నాడు. అందువలన 'డాక్టర్'పై అందరిలోనూ ఆసక్తి ఉంది. హాట్ స్టార్ వారు మంచి రేటుకు ఈ సినిమాను తీసుకున్నారు. ఈ సినిమాను ఎప్పుడు లైన్లో పెట్టేది త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించింది. తెలుగులోను ఈ అమ్మాయికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సుందరి కెరియర్ కి ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.