‘దిశ యాప్’ ఉంటే అన్న తోడుగా ఉన్నట్టే: సీఎం వైఎస్ జగన్
- ఆపదలో ఉన్న మహిళలకు అస్త్రం
- ప్రతి మహిళా డౌన్ లోడ్ చేసుకోవాలి
- ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలి
ప్రకాశం బ్యారేజీ ఘటన కలచి వేసిందని, యువతులు, మహిళల భద్రతకోసమే ఈ దిశ యాప్ ను రూపొందించామని ఆయన చెప్పారు. స్మార్ట్ ఫోన్ ఉండే ప్రతి మహిళా ఈయాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే 17 లక్షల మందికిపైగా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని, యాప్ కు నాలుగు అవార్డులు కూడా వచ్చాయని ఆయన వివరించారు.
పోలీసులు మంచి చేసే ఆప్తులన్నారు. మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేయబోమని ఆయన చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 18 దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, దిశ చట్టాన్నీ తెచ్చామని గుర్తు చేశారు. త్వరలోనే ప్రత్యేక కోర్టులనూ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.