'వీరమల్లు' కోసం ఆగ్రా కోట సెట్!
- మొగల్ కాలం నాటి కథ
- భారీ సెట్ల కోసం కోట్ల ఖర్చు
- బందిపోటు పాత్రలో పవన్
- ప్రియురాలిగా నిధి అగర్వాల్
ఇది మొగల్ చక్రవర్తుల కాలంలో నడిచే కథ. అందువలన ఆ కాలం నాటి భారీ సెట్లు వేస్తున్నారు. ఇందుకోసం నిర్మాత ఎ.ఎమ్. రత్నం పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని భారీ నిర్మాణాలకు సంబంధించిన సెట్స్ వేశారు. ప్రస్తుతం 'ఆగ్రా కోట' తాలూకు సెట్ వేస్తున్నారట. ఇది ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో బందిపోటు పాత్రలో పవన్ నటిస్తుండగా, ఆయన ప్రియురాలిగా నిధి అగర్వాల్ అలరించనుంది. ఈ సినిమాలో ఆమెను మరింత గ్లామరస్ గా కనిపించనుందని అంటున్నారు. ఇక బాలీవుడ్ ఆర్టిస్టులు కూడా భారీ సంఖ్యలోనే కనిపించనున్నారు.