Revanth Reddy: రేవంత్‌ను కాంగ్రెస్ చీఫ్‌గా ప్రకటించిన కాసేపటికే.. కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి రాజీనామా

Kichannagari Laxma Reddy Resigns Congress party
  • తెలంగాణ కాంగ్రెస్‌లో అప్పుడే మొదలైన ముసలం
  • ఏఐసీసీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కేఎల్లార్ రాజీనామా
  • తనకు ఎంపీ సీటు ఇవ్వాలని చెప్పిందే లక్ష్మారెడ్డి అన్న రేవంత్
తెలంగాణ కాంగ్రెస్‌లో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించిన కాసేపటికే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్లార్) పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈ మేరకు ఆ పార్టీ చీఫ్‌ సోనియాగాంధీకి గత రాత్రి లేఖ పంపారు. తెలంగాణ పార్టీ చీఫ్‌గా నియమితులైన తర్వాత గత రాత్రి రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ సీటును తనకు ఇవ్వాలని చెప్పిందే లక్ష్మారెడ్డి అని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఆయన తనకు మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు.
Revanth Reddy
Kichannagari Laxma Reddy
Congress
Telangana

More Telugu News