'ఏజెంట్' మాత్రం అదే రోజున వస్తాడట!

Agent movie will release in December
  • అఖిల్ హీరోగా 'ఏజెంట్'
  • ఫస్టులుక్ కి భారీ రెస్పాన్స్
  • డిసెంబర్ 24వ తేదీన విడుదల
  • ఈ లోగానే రానున్న 'బ్యాచ్ లర్'  
అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' రూపొందుతోంది. రామబ్రహ్మం సుంకర ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో అఖిల్ ను సురేందర్ రెడ్డి కొత్తగా చూపించనున్నాడు. ఈ సినిమా ఫస్టులుక్ బయటికి వచ్చిన దగ్గర నుంచి అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయనున్నామని ముందుగానే చెప్పారు.

అయితే కరోనా కారణంగా చాలా సినిమాల తేదీలు తారుమారు అవుతున్నాయి. ముందుగా అనుకున్న సమయంలో విడుదల కుదరని సినిమాలు డిసెంబర్ దిశగా వెళుతున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ పోటీని తట్టుకోలేని కొన్ని సినిమాలు కూడా డిసెంబర్ బాట పడుతున్నాయి. దాంతో డిసెంబర్ 24వ తేదీని ఖరారు చేసుకున్న అఖిల్ సినిమా, వాయిదా పడొచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే ఈ సినిమాను అదే రోజున విడుదల చేయాలనే గట్టిపట్టుదలతోనే మేకర్స్ ఉన్నారట. ఈ లోగానే 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' ప్రేక్షకులను పలకరించేస్తుందని ప్రత్యేకంగా చెప్పవలసినదేం ఉంటుంది?        
Go Back to Shorts
Akhi
Sakshi Vaidya
Surendar Reddy

More Telugu News