ఆన్ లైన్ లోనే పాఠశాల తరగతులు: సీఎం కేసీఆర్ ఆదేశాలు
- జులై 1 నుంచి తెలంగాణ విద్యాసంస్థల ప్రారంభం
- ప్రత్యక్ష బోధనకు తొందరేమీ లేదన్న కేసీఆర్
- ఆన్ లైన్ బోధన ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశం
- మంత్రి సబితకు దిశానిర్దేశం
ఇటీవలే తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేయడం తెలిసిందే. ఆ సమయంలో, తెలంగాణ ప్రభుత్వం జులై 1 నుంచి విద్యాసంస్థల ప్రారంభానికి అనుమతిచ్చింది. కానీ స్కూళ్లలో ప్రత్యక్ష బోధన సాగుతుందా? ఆన్ లైన్ బోధనా? అనేది స్పష్టత ఇవ్వలేదు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటనతో ఆన్ లైన్ బోధనే అనేది స్పష్టమైంది.