యథార్థ సంఘటన ఆధారంగా సూర్య మూవీ!
- సూర్య నుంచి మరో విభిన్న చిత్రం
- యాక్షన్ తో కూడిన ఎమోషన్
- జులై 23వ తేదీన ఫస్టులుక్
- కీలకమైన పాత్రలో సత్యరాజ్
ఈ నేపథ్యంలో ఈ సినిమా కథ ఏమైవుంటుందనే విషయం అందరిలో కుతూహలాన్ని పెంచుతోంది. ఈ సినిమా ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోందనేది తాజా సమాచారం. కొంతకాలం క్రితం 'పొల్లాచ్చి'లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఆధారంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారట. సూర్య పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, జులై 23వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, సత్యరాజ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు.