అమెరికా వెళ్లే విద్యార్థులకు ఊరట.. గడువు 25 రోజుల పొడిగింపు

Good news for Students who want to go america
  • జులై నెల వీసా కోటాను విడుదల చేసిన అమెరికా కాన్సులేట్
  • ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న వర్సిటీలతో సంప్రదించి తేదీలు తెలుసుకోవాలని సూచన
  • ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా ఏర్పాట్లు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇది ఊరటనిచ్చే వార్తే. జులైలో ప్రారంభం కానున్న తరగతులకు హాజరు కావాల్సిన విద్యార్థుల గడువును మరో 25 రోజులు పొడిగిస్తూ యూనివర్సిటీలు నిర్ణయించాయి. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఆగస్టు పదో తేదీ నుంచి మరికొన్ని యూనివర్సిటీలు ప్రారంభం కానుండగా, ఆయా వర్సిటీల అధికారులతో సంప్రదించి తేదీలను తెలుసుకోవాలని సూచించారు. మరోవైపు, వచ్చే నెల వీసా కోటాను అమెరికా కాన్సులేట్ విడుదల చేసింది.

కరోనా కారణంగా భారత్‌లో వీసా ప్రక్రియ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతోపాటు ముంబై, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతాలోని కాన్సులేట్ల ద్వారా విద్యార్థి వీసా ఇంటర్వ్యూల ప్రక్రియను ఈ నెల 14 నుంచి ప్రారంభించాయి. మరోవైపు, నిన్న జులైకి సంబంధించిన వీసా కోటాను కూడా విడుదల చేయడంతో విద్యార్థులు స్టాట్స్ పొందారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా కాన్సులేట్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Go Back to Shorts
America
Students
Visa
Hyderabad

More Telugu News