అమెరికాలో కుప్పకూలిన 12 అంతస్తుల భవనం... 99 మంది గల్లంతు
- మయామీలో ఘోర ప్రమాదం
- అపార్ట్ మెంటులో కూలిన ఒకవైపు భాగం
- కొనసాగుతున్న సహాయక చర్యలు
- ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
ఈ భవనంలోని మరోవైపున ఉన్న ఫ్లాట్ల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. దీని చుట్టు పక్కల ఉన్న భవనాల నుంచి కూడా ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటివరకు శిథిలాల నుంచి ఇద్దరిని వెలికితీసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. వారి ఆరోగ్య పరిస్థితిపై మాత్రం వివరాలు తెలుపలేదు.