01 Fri 11:56 తిరుపతి సమీపంలో భూములను తిరిగి ఏపీ సర్కారుకి ఇచ్చేసిన రిలయన్స్ సంస్థ! ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం గతంలో భూములు 15 మంది రైతులు పలు కారణాలతో కోర్టులో కేసులు అవి పరిష్కారం అయ్యే వరకు యూనిట్ ఏర్పాటు కష్టం దీంతో యూనిట్ ఏర్పాటుకు రిలయన్స్ విముఖత
02 Fri 09:06 స్విస్ బ్యాంకుల్లో తగ్గిన ఇండియన్ మనీ.. ప్రస్తుతం అక్కడ మనోళ్ల మొత్తం సొమ్ము ఎంత ఉందంటే..! స్విస్ బ్యాంకుల్లో 8 శాతం తగ్గిన భారతీయుల నిధులు మొత్తం నిధులు రూ.36,793 కోట్లకు చేరినట్లు వెల్లడి అయితే 50 శాతం పైగా పెరిగిన కస్టమర్ ఖాతాల్లోని డిపాజిట్లు ఇది నల్లధనం కాదని స్పష్టం చేసిన స్విస్ నేషనల్ బ్యాంక్ భారత్‌తో సమాచార మార్పిడి ఒప్పందం అమల్లో ఉన్నట్లు వెల్లడి
03 Fri 08:52 ఇజ్రాయెల్‌కు జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్.. టెన్షన్ పుట్టిస్తున్న వైట్ హౌస్ వ్యాఖ్యలు! అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం ఇరాన్ అణు నిరోధానికి ఈ ఒప్పందం సరిపోదంటూ ఇజ్రాయెల్ మంత్రుల అభ్యంతరం ఇజ్రాయెల్ విమర్శలపై తీవ్రంగా స్పందించిన అమెరికా ఉపాధ్యక్షుడు ప్రపంచంలో ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న ఏకైక పెద్ద దేశం అమెరికానే అని వాన్స్ స్పష్టీకరణ అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్న వాస్తవాన్ని ఇజ్రాయెల్ గుర్తించాలని వైట్ హౌస్ హెచ్చరిక
04 Fri 08:37 అమెరికానే ఒప్పందం కోసం ఆత్రుత చూపింది: ఖమేనీ అమెరికాతో కుదిరిన ఒప్పందంపై ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు నిరాశతో ట్రంప్ అనేక ఒత్తిళ్లు తెచ్చినట్లు వెల్లడి ఒప్పందంపై తనకు భిన్నాభిప్రాయం ఉందని వ్యాఖ్య భవిష్యత్తులో అదనపు డిమాండ్లు తెస్తే అంగీకరించమని స్పష్టీకరణ
05 Fri 08:34 మోదీ ఫ్రాన్స్ పర్యటనకు అరుదైన ముగింపు.. ప్రధానికి హిందీలో మాక్రాన్ వీడ్కోలు సందేశం 'ప్రియ మిత్ర నరేంద్ర, ఫ్రాన్స్-భారత్ దోస్తీ అమర్ రహే' అంటూ స్నేహాన్ని చాటిన మాక్రాన్ రక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకోవాలని ఇరు దేశాల నిర్ణయం 'స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్' స్థాయికి చేరిన భారత్-ఫ్రాన్స్ సంబంధాలు ఫిబ్రవరిలో మళ్లీ కలుద్దామంటూ మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రత్యేక ఆహ్వానం
06 Fri 08:14 అప్పుడు ఆమె లేకుంటే నేను జైల్లోనే సూసైడ్ చేసుకునేవాడిని: శ్రీశాంత్ తిహార్ జైలులో ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పిన శ్రీశాంత్ భార్య భువనేశ్వరి వల్లే తాను బతికి ఉన్నానని వెల్లడి స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్న మాజీ క్రికెటర్ కష్టకాలంలో తన భార్య, ఆమె కుటుంబం అండగా నిలిచారని భావోద్వేగం బెయిల్‌పై బయటకు రావడానికి తన భార్యే కారణమని వ్యాఖ్య
07 Fri 08:06 వైభవ్ ఇంకా చిన్న పిల్లాడేనన్న బీసీసీఐ.. ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్‌కు తల్లిదండ్రులను పంపుతున్న బోర్డు! ఐపీఎల్ లో పరుగుల విధ్వంసం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపిక వయసు చిన్నది కావడంతో విదేశీ టూర్‌కు తల్లిదండ్రులను అనుమతించిన బీసీసీఐ ప్రయాణ, వసతి ఖర్చులన్నీ తామే భరిస్తామని ప్రకటించిన బోర్డు కార్యదర్శి జూన్ చివర్లో ఐర్లాండ్‌తో, జూలైలో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడనున్న భారత్
08 Fri 07:57 కర్ణాటకలో బీజేపీకి భారీ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్! కర్ణాటకలో ఖాళీగా ఉన్న 7 ఎమ్మెల్సీ స్థానాలకు నిన్న ఎన్నికలు ఎన్డీఏ కూటమి నుంచి భారీగా క్రాస్ ఓటింగ్ 5 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైన బీజేపీ జేడీఎస్ అభ్యర్థి ఘోర పరాజయం
09 Fri 07:41 ప్రపంచ దేశాలకు ఇరాన్ బంపర్ ఆఫర్.. ‘హర్మూజ్’లో 60 రోజుల పాటు ఉచిత ప్రయాణం! ఒప్పందం ప్రకారం ‘హర్మూజ్’లో రవాణా రుసుములను రద్దు చేసిన ఇరాన్ రాబోయే 60 రోజుల పాటు అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు ఉచిత ప్రయాణం ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్ని అధికారికంగా తొలగించిన అమెరికా పర్షియన్ గల్ఫ్ జలసంధి అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి
10 Fri 07:23 24 వరకు తెలంగాణలో వడగాల్పులు.. ఆ వెంటనే భారీ వర్షాలు కురిసే అవకాశం! మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణ, తూర్పు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాల విస్తరణ ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఆలస్యమైన వర్షాల రాక మొత్తం 741 జిల్లాలలో 400కి పైగా జిల్లాల్లో నమోదైన వర్షపాత లోటు జూన్ 24 వరకు ఉత్తరప్రదేశ్, విదర్భ, తెలంగాణలో కొనసాగనున్న వడగాల్పుల తీవ్రత వచ్చే వారం నుంచి వర్షాలు పుంజుకుని ఖరీఫ్ సాగుకు ఊతం ఇస్తాయన్న ఐఎండీ