ఆదిలాబాద్ జిల్లాలో దారుణం.. ప్రసాదం తీసుకెళ్లిన బాలికపై స్వామీజీ అత్యాచారం
- నేరేడిగొండ మండలం రాజూరలో ఘటన
- గదిలో స్పృహ కోల్పోయిన స్థితిలో బాలిక
- నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
అలా వెళ్లిన బాలిక సమయం గడుస్తున్నా ఇంటికి చేరకపోవడంతో అనుమానించిన కుటుంబ సభ్యులు ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ సాధువు కనిపించకపోవడంతో పక్కనే ఉన్న నివాసం వద్దకు వెళ్లారు. దాని తలుపులు లోపలి నుంచి పెట్టి ఉండడంతో అనుమానంతో బద్దలుగొట్టి లోపలికి వెళ్లి చూడగా బాలిక స్పృహ కోల్పోయి ఉంది. బాలిక ద్వారా అసలు విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి, దర్యాప్తు చేస్తున్నారు.