ఏపీలో కొత్తగా 2,620 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 55,002 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 531 కొత్త కేసులు
- అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 88 కేసులు
- రాష్ట్రంలో 44 కరోనా మరణాలు
- కరోనా నుంచి కోలుకున్న 7,504 మంది
అదే సమయంలో రాష్ట్రంలో 7,504 మంది కరోనా నుంచి కోలుకోగా, 44 మంది మరణించారు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 10 మంది కన్నుమూశారు. ఏపీలో ఇప్పటివరకు 18,53,183 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 17,82,680 మంది కోలుకున్నారు. ఇంకా 58,140 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,363కి చేరింది.