ఎల్జేపీ నూతన అధ్యక్షుడిగా పశుపతి కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
- పాట్నాలో జరిగిన పార్టీ జాతీయ కార్యనిర్వాహక వర్గ భేటీలో ఎన్నిక
- రాజ్యాంగ విరుద్దమన్న చిరాగ్ పాశ్వాన్
- పారస్‌కు వ్యతిరేకంగా పాట్నాలో నిరసన ప్రదర్శనలు
పశుపతి పారస్ ఎన్నికను చిరాగ్ పాశ్వాన్ తిరస్కరించారు. జాతీయ కార్య నిర్వాహక వర్గం భేటీ రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఆదేశాలతోనే పశుపతి వర్గం పార్టీలో తిరుగుబాటు చేసిందని ఆరోపించారు. పార్టీ అసలైన కార్య నిర్వాహక వర్గ సమావేశం ఆదివారం ఢిల్లీలో జరుగుతుందన్నారు.