'నీలాంబరి' తరహా పాత్రను చేయాలనుందట!
- కన్నడ సినిమాలతో ప్రియమణి బిజీ
- రీ ఎంట్రీలో పడుతున్న డిఫరెంట్ రోల్స్
- తెలుగులోనూ బిజీ అవుతుందట!
తెలుగులో ఆమె 'విరాటపర్వం' సినిమాలోను .. 'నారప్ప' సినిమాలోను ముఖ్యమైన పాత్రలను పోషించింది. ఈ రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కరోనా ప్రభావం పూర్తిస్థాయిలో తగ్గగానే థియేటర్లకు రానున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఆమె మాట్లాడుతూ .. "నేను చేసిన ఈ రెండు పాత్రలు చాలా విభిన్నమైనవే. తెలుగులో నా కెరియర్ ఊపందుకునేలా చేసేవే. 'నరసింహ' సినిమాలో రమ్యకృష్ణ చేసిన 'నీలాంబరి' తరహా పాత్రలో చేయాలనుంది. పొగరు .. పంతంతో కూడిన అలాంటి పాత్రలు నా బాడీ లాంగ్వేజ్ కి బాగా సెట్ అవుతాయి. అలాంటి పాత్ర కోసం వెయిట్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. ఆమె ముచ్చట తీరుతుందేమో చూడాలి మరి.