ఏపీకి భారీ సంఖ్యలో చేరుకున్న కరోనా వ్యాక్సిన్ డోసులు
- ఏపీలో రెండ్రోజులుగా నిలిచిన వ్యాక్సినేషన్
- తాజా డోసుల రాకతో ఊరట
- 9 లక్షల కొవిషీల్డ్, 76 వేల కొవాగ్జిన్ డోసుల రాక
- గన్నవరం టీకా డోసుల నిల్వ కేంద్రానికి తరలింపు
ఇక, పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలోనూ కరోనా వ్యాక్సినేషన్ కొనసాగింపుపై అనిశ్చితి నెలకొంది. రాష్ట్రం వద్ద ప్రస్తుతానికి 7.5 లక్షల టీకా డోసులు ఉండగా, కేంద్రం నుంచి తదుపరి కేటాయింపులు రాకపోవడం తెలంగాణ యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.