మృతుల కుటుంబాలకు భారీ పరిహారం.. ఇటలీ నావికా సిబ్బందిపై కేసులను మూసివేసిన సుప్రీంకోర్టు!
- 2012లో ఇద్దరు కేరళ మత్స్యకారుల కాల్చివేత
- ఇటలీ నౌకా సిబ్బందిపై ఆరోపణలు
- సుప్రీంలో విచారణ
- రూ.10 కోట్ల పరిహారం చెల్లించిన ఇటలీ ప్రభుత్వం
ఈ నేపథ్యంలో, ఇటలీ ప్రభుత్వం కేరళ మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 కోట్లు పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించడంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. ఈ కేసుపై విచారణ జరుపుతున్న భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటలీ నావికులపై విచారణ ఇంతటితో ముగిస్తున్నట్టు నేడు వెల్లడించింది. ఇటలీ చెల్లిస్తానంటున్న పరిహారం సంతృప్తికరంగా ఉందని, ఈ కేసు మూసివేతకు రాజ్యాంగం ప్రకారం ఇదే సరైన సమయం అని భావిస్తున్నామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అయితే, భారత్, ఇటలీ, కేరళ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలు, అంతర్జాతీయ మధ్యవర్తిత్వ నిబంధనలు అనుసరించి ఇకపై ఆ ఇద్దరు నావికులపై ఇటలీలో విచారణ జరపాలని స్పష్టం చేసింది.
కాగా, ఇటలీ ప్రభుత్వం ఇచ్చిన రూ.10 కోట్ల పరిహారంలో చనిపోయిన మత్స్యకారుల కుటుంబాలకు రూ.4 కోట్ల చొప్పున ఇవ్వనున్నారు. వారి బోటు యజమానికి మిగిలిన రూ.2 కోట్లు ఇవ్వనున్నారు.