పిల్లలపై కొవాగ్జిన్ టీకా ట్రయల్స్‌కు సన్నాహాలు.. నేడు ఎయిమ్స్‌లో బాల వలంటీర్ల ఎంపిక
- 12-18 ఏళ్ల వయసు వారికి ఇప్పటికే ప్రారంభమైన ట్రయల్స్
- చిన్నారులను మూడు భాగాలుగా విభజించి పరీక్షలు
- పరీక్షల్లో భాగంగా కండరానికి టీకా
- రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధి
మరోవైపు, 2 నుంచి 18 ఏళ్ల వయసు వారిపై కొవాగ్జిన్ క్లినికల్ పరీక్షలకు భారత్ బయోటెక్‌కు అనుమతి ఇస్తూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఏ) గత నెల 12న ఆదేశాలు జారీ చేసింది. చిన్నారులను మూడు గ్రూపులుగా విభజించి టీకా పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కండరానికి టీకా ఇస్తారు. రెండు డోసుల మధ్య 28 రోజుల వ్యవధిని పాటిస్తారు.