బైక్ ర్యాలీలో మాస్క్ ధరించనందుకు బ్రెజిల్ అధ్యక్షుడికి జరిమానా!
- వంద డాలర్లు ఫైన్ వేసిన సావో పాలో గవర్నర్
- కరోనా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణ
- పెద్ద సంఖ్యలో ప్రజలను గుమిగూడేలా చేశారని ఫైర్

ఆ ర్యాలీలో స్వయంగా బైక్ నడిపిన బోల్సోనారో ఓపెన్ ఫేస్ హెల్మెట్ పెట్టుకున్నారు. మాస్కును మాత్రం మరిచారు. అది సావో పాలో నిబంధనలకు విరుద్ధమన్న గవర్నర్ జొవావో డోరియా ఫైన్ వేశారు. వచ్చే ఏడాది ఎన్నికలుండడంతో ఇప్పటి నుంచే సన్నాహకాలు ప్రారంభించిన బోల్సోనారో బైక్ ర్యాలీ తీశారు.
అయితే, రాజకీయ ప్రత్యర్థి అయిన డోరియా.. ర్యాలీ తీయొద్దని, నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా వినిపించుకోకుండా ఆయన ర్యాలీకి వెళ్లారు. వాస్తవానికి ముందు నుంచీ ఇంట్లో ఉండడం, మాస్క్ ధరించడం వంటి నిబంధనలకు వ్యతిరేకంగానే ఉన్నారు.