జగన్ అక్రమాస్తుల కేసు: ‘అరబిందో’ మాజీ కార్యదర్శి చంద్రమౌళి మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలని కోర్టు ఆదేశం
- హెటిరో, అరబిందో కేసు నిందితుడు చంద్రమౌళి ఏప్రిల్ 10న మృతి
- అభియోగాల నమోదుకు సమయం ఇస్తూ కేసును వాయిదా వేసిన కోర్టు
- జగన్ పిటిషన్‌పై విచారణ 22వ తేదీకి వాయిదా
కాగా, ఇదే కేసులో తన తరపున సహకరించడానికి మరో నిందితుడిని అనుమతించాలంటూ జగన్ పెట్టుకున్న పిటిషన్ విచారణకు రాగా దానిని కోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, వాన్‌పిక్, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణతోపాటు రాంకీ కేసులో ఏ-2 నిందితుడైన విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనల కొనసాగింపునకు విచారణను ఈ నెల 15కు కోర్టు వాయిదా వేసింది.