'పుష్ప' సాంగులో మెగాస్టార్ మెరుస్తారంటూ రూమర్!
- సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ క్రేజీ కాంబినేషన్
- స్పెషల్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్
- 'పుష్ప' కోసం మాస్ మసాలా సాంగ్
- అభిమానుల్లో పెరుగుతున్న ఆసక్తి
ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. దేవిశ్రీ - సుకుమార్ కాంబినేషన్లో ఇంతవరకూ వచ్చిన స్పెషల్ సాంగ్స్ ఒక రేంజ్ లో జనంలోకి దూసుకుపోయాయి. అలాగే ఈ సినిమాలోనూ ఒక స్పెషల్ సాంగ్ ఉండనుంది. ఈ సాంగులో ఒక చోట చిరంజీవి ఇలా మెరిసి అలా మాయమవుతారట. ఆ బిట్ మెగా ఫ్యాన్స్ కి మంచి కిక్కు ఇస్తుందని అంటున్నారు. మెగా ఫ్యామిలీ హీరోల సినిమాల్లో సరదాగా ఇలా మెరవడానికి చిరంజీవి సరదాపడతారనేది నిజమే అయినా, ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.