పవన్ కల్యాణ్ 28వ చిత్రంపై మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటన
- హరీశ్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కొత్త చిత్రం
- పవన్ 28వ చిత్రం స్టిల్స్ అంటూ ఫొటోలు ప్రచారం
- టైటిల్ పైనా సోషల్ మీడియా పోస్టులు
- వివరణ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్
- తాము చెబితేనే అఫిషియల్ అవుతుందని వెల్లడి
వాస్తవానికి పవన్ 28వ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ ఉగాది రోజున విడుదల చేయాలని నిర్ణయించామని, కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ నిర్ణయం వాయిదా పడిందని వెల్లడించింది. అయితే, ఇప్పుడు సోషల్ మీడియాలో పవన్ కొత్త చిత్రానికి సంబంధించి కొన్ని అంశాలు వినిపిస్తున్నాయని, వాటిలో నిజం లేదని మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. పవన్ 28వ చిత్రానికి సంబంధించి ఏ విషయం అయినా తమ అధికారిక ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని పేర్కొంది. అభిమానులు ఈ విషయం గమనించాలని సూచించింది.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫొటో ఇదే... (ఫ్యాన్ మేడ్)