కరోనాను పొమ్మంటూ... రోడ్లపైకి వచ్చి దెయ్యాల నృత్యం చేసిన వెనిజులా ప్రజలు
- వెనిజులాలో వింత ఆచారం
- నజరీన్ నిర్వహించిన గ్వాజిరా ప్రాంత వాసులు
- సుదీర్ఘకాలం కిందట ఆఫ్రికా నుంచి వలస
- కేథలిక్ సంప్రదాయం ప్రకారం వేడుకలు
ఈ ఏడాది కూడా గ్వాజిరా సముద్ర తీరప్రాంత పట్టణాల్లో ఈ వేడుకలు జరిపారు. అయితే ఈసారి కరోనాను పారదోలేందుకు దెయ్యాల డ్యాన్స్ చేశారు. చెడుపై మంచి గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని వీరు ప్రతి ఏటా నజరీన్ నిర్వహిస్తుంటారు. ఈసారి కరోనాపై మానవాళి గెలవాలన్న సదుద్దేశంతో ఈ తెగ ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి నృత్యాలు చేశారు.