ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావును నియమించిన ప్రభుత్వం
- నిన్న పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఎండీ ఆర్‌పీ ఠాకూర్
- ఉత్తర్వులు జారీ చేసిన ఆదిత్యనాథ్ దాస్
- ఏపీ పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఎండీగా ఎన్.సంజయ్
ద్వారకా తిరుమలరావును ఆర్టీసీ ఎండీగా, ప్రజా రవాణా విభాగం కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ విభాగం అదనపు డీజీగా ఉన్న ఎన్. సంజయ్‌ని ఏపీ పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఎండీగా నియమించారు. అలాగే, సిబ్బంది, శిక్షణ విభాగం అదనపు డీజీగా కూడా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.