ఇంతకాలానికి నిరీక్షణ ఫలించిందంటున్న ప్రియమణి!
- చెప్పుకోదగిన సినిమా 'యమదొంగ'
- కన్నడ .. మలయాళ భాషల్లో బిజీ
- 'నారప్ప'తో తెలుగులోకి రీ ఎంట్రీ
- 'విరాటపర్వం'లోను మంచి పాత్ర
తాజాగా 'నారప్ప' సినిమాలో ఆమె వెంకటేశ్ భార్య పాత్రలో నటించింది. ఈ పాత్రను గురించి తాజాగా ఆమె చెబుతూ.. " వెంకటేశ్ సరసన నటించాలనే కోరిక నాకు చాలాకాలం నుంచి ఉండేది. గతంలో ఆయన జోడీకట్టే అవకాశాలు వచ్చాయికానీ, చివరి నిమిషంలో చేజారిపోయాయి. ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నేను చేసిిన పాత్రకి మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది. ఇక 'విరాటపర్వం' సినిమాలోని భరతక్క పాత్రకి కూడా మంచి పేరు వస్తుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.