ఏపీలో కనిష్ఠ స్థాయికి రోజువారీ కరోనా కేసులు

Corona cases record low in two months in AP
  • చాన్నాళ్ల తర్వాత 10 వేల లోపున కొత్త కేసులు
  • గత 24 గంటల్లో 7,943 మందికి కరోనా పాజిటివ్
  • 11 జిల్లాల్లో వెయ్యికి లోపే కొత్త కేసులు
  • రాష్ట్రంలో 98 మంది మృతి
  • చిత్తూరు జిల్లాలో 15 మంది కన్నుమూత
సెకండ్ వేవ్ సందర్భంగా ఏపీలో ఉద్ధృతస్థాయిలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రస్తుతం బాగా నెమ్మదించింది. నెల రోజుల తర్వాత ఏపీలో రోజువారీ కేసులు పది వేల లోపుకు దిగొచ్చాయి. గత 24 గంటల్లో 83,461 కరోనా పరీక్షలు నిర్వహించగా కేవలం 7,943 కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి (1,877), చిత్తూరు (1,283) జిల్లాలను మినహాయిస్తే, మిగతా అన్ని జిల్లాల్లో వెయ్యికి లోపే కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 231 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 19,845 మంది కరోనా నుంచి కోలుకోగా, 98 మంది మరణించారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 12 మంది, ప్రకాశం జిల్లాలో 10 మంది మృతి చెందారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 10,930కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 16,93,085 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా సోకినవారిలో 15,28,360 మంది కోలుకోగా, ఇంకా 1,53,795 మంది చికిత్స పొందుతున్నారు.
Go Back to Shorts
Corona Virus
Andhra Pradesh
New Cases
Deaths
COVID19
Second Wave

More Telugu News