పోలీసుల వలయంలో ఆనందయ్య

కరోనాకు నాటు మందును తయారు చేసి యావత్ దేశం దృష్టిని ఆకర్షించిన నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య ప్రస్తుతం పోలీసుల వలయంలో ఉన్నారు. ఆయనను కృష్ణపట్నం గోపాలపురంలోని కేపీఎస్ఎస్పీఎల్ అకాడమీలో పోలీసులు ఉంచారు. మరోవైపు ప్రజాప్రతినిధులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిరోజు ఆయన చేత మందును తయారుచేయించుకుని తీసుకెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇదిలావుంచితే, ఆనందయ్య మందుపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది.


More Telugu News