సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

Kajal to play De glam role first time
  • కథానాయిక ప్రధాన చిత్రంలో కాజల్ 
  • మరో ప్రాజక్టుకి వెంకటేశ్ గ్రీన్ సిగ్నల్
  • మహేశ్ కి విలన్ గా అరవింద్ స్వామి?
*  గ్లామరస్ తార కాజల్ అగర్వాల్ తొలిసారిగా డీ-గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించనుంది. నూతన దర్శకుడు జయశంకర్ రూపొందించే కథానాయిక ప్రధాన చిత్రంలో కాజల్ ఇలా డీ-గ్లామరైజ్డ్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను త్వరలో ప్రకటిస్తారు.
*  ప్రస్తుతం 'నారప్ప', 'దృశ్యం 2', 'ఎఫ్ 3' చిత్రాలలో నటిస్తున్న ప్రముఖ నటుడు వెంకటేశ్ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు మహా వెంకటేశ్ ఇటీవల హీరో వెంకటేశ్ కి ఓ కథ చెప్పాడనీ, దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.
*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారు వారి పాట' చిత్రంలో ప్రధాన విలన్ పాత్రను ప్రముఖ నటుడు అరవింద్ స్వామి పోషించే అవకాశం వుంది. ఈ విషయంలో ప్రస్తుతం ఆయనతో చిత్ర బృందం సంప్రదింపులు జరుపుతోంది. ఇతర కీలక పాత్రలలో ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ నటిస్తున్నారు. ఇందులో కీర్తి సురేశ్  నటిస్తోంది.
Go Back to Shorts
Kajal Agarwal
Venkatesh
Aravind Swamy
Mahesh Babu

More Telugu News