నెల్లూరు జిల్లాలో పలు చోట్ల భూ ప్రకంపనలు... భయాందోళనలో ప్రజలు!
- వరికుంటపాడు మండలంలో కంపించిన భూమి
- 3 సెకన్ల పాటు ప్రకంపనలు
- సమాచారం సేకరిస్తున్న అధికారులు
- ఇళ్లలో ఉండేందుకు భయపడుతున్న స్థానికులు
ఎలాంటి ఆస్తినష్టం సంభవించకపోయినా, ఒక్కసారిగా భూమి అదరడంతో ప్రజలు హడలిపోయారు. ఇళ్లలో ఉండేందుకు వెనుకంజ వేస్తున్నారు. భూ ప్రకంపనలపై స్పందించిన అధికారులు స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.